ఆత్మీయ కలయిక…

ఆత్మీయ కలయిక…

జగన్‌తో జిల్లా నేతల ఆత్మీయ భేటీ
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ కలిసిన నాయకులు
జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై విస్తృత చర్చ
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మహిళా నేతల హాజరు

విజయవాడ, ఆంధ్రప్రభ : విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ను జిల్లా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఆత్మీయ సమావేశంలో జిల్లా రాజకీయాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు పాల్గొనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ భేటీలో జిల్లా వైసిపి అధ్యక్షుడు దేవినేని అవినాష్ తో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితులు, క్షేత్రస్థాయి సమీకరణలు, రాబోయే రాజకీయ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. జిల్లాలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై కూడా నాయకత్వానికి పలు సూచనలు చేసినట్లు సమాచారం.

Leave a Reply