అంతర్జాతీయ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ వీడ్కోలు
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తన 15 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు తెలిపాడు బెన్ స్టోక్స్. ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్టోక్స్.. ఇంగ్లండ్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు.
2019 ప్రపంచకప్ ఫైనల్లో అసాధారణ పోరాటంతో ఇంగ్లండ్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించారు. అదే ఏడాది యాషెస్ సిరీస్‌లో హెడింగ్లే టెస్టులో ఆడిన 135 నాటౌట్ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. 2022 టీ20 ప్రపంచకప్ విజయంలోనూ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించారు.
2022లో టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కలిసి దూకుడైన ‘బాజ్‌బాల్’ శైలికి శ్రీకారం చుట్టి ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌కు కొత్త దిశను చూపించారు. స్టోక్స్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 10 వేలకుపైగా పరుగులు చేయడంతో పాటు 300కు పైగా వికెట్లు పడగొట్టి ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.
