ముస్కు నరేందర్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాళి
కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మామగారైన ముస్కు నరేందర్ రెడ్డి మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తంగడపల్లిలోని వారి నివాసానికి చేరుకుని ముస్కు నరేందర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి అశ్రునయనాల మధ్య ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
తదనంతరం అంత్యక్రియల్లో పాల్గొని ముస్కు నరేందర్ రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి పబ్బు రాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
