పల్నాడు ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేయాలి
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చందోలు సూర్యప్రకాశరావు బుధవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చందోలు సూర్యప్రకాశరావును శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేయడంతో పాటు సంఘ సభ్యుల సంక్షేమానికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఈసీ సభ్యుడు గుర్రం సాంబశివరావు, అయినవోలు రాధా, అమరా రమాదేవి, కూనల ప్రమీల, అరవపల్లి వీరాంజనేయులు, డాక్టర్ సురేష్, వెల్లంపల్లి రవిశంకర్, నాగమల్లి, అమరా మణి, తవ్వ చలపతి తదితర ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు సుమారు 50 మంది పాల్గొన్నారు.
