చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

బంటుమిల్లి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా బంటుమిల్లిలో నిర్వహించిన వేడుకల్లో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
బంటుమిల్లి హీరో షోరూమ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శంకర్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్, తేలప్రోలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడే కాకుండా దూరదృష్టి కలిగిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. 76 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా భావించే నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
