డాబా పై నుండి పడి వ్యక్తి మృతి..
డాబా పై నుండి పడి వ్యక్తి మృతి..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం బలరాంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే ఏసు పాదం (55) అనే వ్యక్తి ఇంటి డాబాపై నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు చికిత్స నిర్వహించి అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏసు పాదం మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, స్థానికుల వాదన మరో విధంగా ఉంది. భార్యతో జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా డాబా పైనుండి దూకినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
