ఆటో బోల్తా… 8 మంది కూలీలకు గాయాలు..

ఆటో బోల్తా… 8 మంది కూలీలకు గాయాలు..

కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : కంచికచర్ల మార్కెట్ యార్డ్ సమీపంలో కంచికచర్ల వైపు వస్తున్న ఆటో ప్రమాద వశాత్తు బోల్తా కొట్టిన సంఘటనలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. పోలీసుల కధనం మేరకు మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం దొనబండకు చెందిన చంపా దుర్గ అనే మహిళతో పాటు మరో 5 గురు వ్యక్తులు తాపీ పని నిమిత్తం కంచికచర్ల వచ్చేందుకు ఆటో ఎక్కారు. అలాగే కంచికచర్ల మండలం పరిటాలలో మరో ఇరువురు కూలీలు అదే ఆటో ఎక్కారు.

ఆటో పరిటాల దాటి కంచికచర్ల సమీపంలో మార్కెట్ యార్డ్ వద్దకు రాగానే రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్టు కొమ్మను తప్పించబోయి అదుపుతప్పి ఆటో రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ఉన్న దుర్గతో పాటు మిగతా 7 కూలీలకు గాయాలయ్యాయి. వీరిని మొదట స్తానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కంచికచర్ల పోలీసులు తెలిపారు.