Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో కేఎల్లార్‌

Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో కేఎల్లార్‌

ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం

Indiramma Houses | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేఎల్లార్ అన్నారు. మహేశ్వరం మండలంలో ఇవాళ (సోమ‌వారం) 32 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించామని ఆయ‌న తెలిపారు. డబిల్ గూడ, సుభాన్ పూర్, మాణిక్యమ్మగూడ, మన్సాన్ పల్లి, చిన్నతూర్ప, అమీర్ పేట, మహేశ్వరం, గంగారం తండా గ్రామాల్లో పలు నూతన ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

ప్రజాపాలనలో ప్రతీ ఇంటికి కాంగ్రెస్ సంక్షేమం చేరుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కలను పేదలకు నెరవేర్చుతున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని లక్ష్మారెడ్డి అన్నారు.గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రెండో విడతలో 2.50 లక్షల ఇండ్లను మంజూరు చేయనున్నట్లు కిచ్చెన్నగారు తెలిపారు. సన్నబియ్యం ఇఛ్చి ప్రతీ పేదవాడి కడుపునింపేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దశాబ్ద కాలంలో ఒక్క ఇల్లు కట్టించని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సర్కార్ ను విమర్శించే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి సహా నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply