గురువు బాధ్యత సమాజ నిర్మాణంలో కీలకం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు మెస్రం మనోహర్‌కు ఘన సన్మానం

జైనూర్, ఆంధ్రప్రభ: సమాజ నిర్మాణంలో గురువు పాత్ర ఎంతో గొప్పదని, ఉపాధ్యాయులు నిర్వర్తించే బాధ్యత అత్యంత విలువైనదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు.

బుధవారం జైనూర్ మండల కేంద్రంలోని కేఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు మెస్రం మనోహర్ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెస్రం మనోహర్ విద్యారంగానికి అందించిన సేవలను ఆమె ప్రశంసించారు.

ఈ సందర్భంగా రాజ్ గోండు సేవాసమితి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనక దేవేందర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయుల సమస్యలు, ఖాళీ పోస్టుల భర్తీ అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుల ఖాళీ పోస్టుల భర్తీతో పాటు అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పలువురు వక్తలు మెస్రం మనోహర్ విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాసిమెట్ట కాంప్లెక్స్ హెచ్‌ఎం అనిత, ప్రధాన్ పురోహిత్ రాష్ట్ర అధ్యక్షుడు, బీడీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, రాజ్ గోండు సేవాసమితి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనక దేవేందర్, జైనూర్ సహకార సంఘం చైర్మన్ కొడప హన్ను పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, తోడసం ధర్మరావు, టిడబ్ల్యూటీయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోట్నాక్ భీమ్రావు, సర్పంచులు కొడప ప్రకాష్, శేషు నారాయణ, జాదవ్ శ్రావణ్, నాగోరావ్, మాజీ సర్పంచులు మెస్రం రాహుల్, మెస్రం నాగోరావ్, ఎస్‌సీఆర్‌పీ ఉయిక శంకర్, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.