ఎండల తీవ్రత దృష్ట్యా జనగణన‌ శిక్షణను ఒక పూట కుదించాలి

ఎండల తీవ్రత దృష్ట్యా జనగణ శిక్షణను ఒక పూట కుదించాలి

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో జనగణన పై ఇస్తున్న శిక్షణా తరగతులను ఎండల తీవ్రత కారణంగా రెండు పూటలు ఇచ్చే ఒక పూట కు కుదించి నిర్వహించాలని టీజీ టీటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ రవీందర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు గురువారం శిక్షణ తరగతులలో పాల్గొన్న ఉట్నూర్ డిప్యూటీ తాసిల్దార్ అమృత్ లాల్ కు వినతిపత్రం ఇచ్చినట్లు వారు తెలిపారు.

ఈ విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయని సంఘ నాయకులు ఇచ్చిన అభివృద్ధి పత్రంలో పేర్కొన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు జాదవ్ ఉత్తమ్, రాథోడ్ దత్తరాం, రాథోడ్ గోవింద్,సుఖేందర్, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.