రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం బిజెపి..

రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం బిజెపి..

చెన్నూర్ ,(ఆంధ్రప్రభ ) ఆరుగాలం శ్రమించి పండించిన వరి రైతులను ప్రభుత్వం అరిగోస పెడుతుందని బిజెపి నియోజకవర్గ నాయకులు దుర్గం అశోక్ ఆరోపించారు. శనివారం స్థానిక రైతుల వడ్ల కల్లాలను అశోక్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యన్ని కొనుగులు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.మార్కెట్ యార్డ్ వద్ద కనీసం రైతులకు తాగు నీరు అందివ్వకపోగా సెంటర్ వద్ద జాప్యం కారణంగా రైతులు తల్లడిల్లి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేక రైతు పండించిన పంటను తూకం, లోడింగ్, ఆన్ లొండింగ్ పేరుతొ దోపిడీ చేస్తున్నారని, జిల్లా కలెక్టర్ వారికొనుగోలు కేంద్రాలు సందర్శించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply