teachers | కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేయద్దు….

teachers | కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేయద్దు….
teachers | జైనూర్, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై అంగన్వాడి టీచర్లు నిర్లక్ష్యం చేయవద్దని కొమురం భీం ఆసి ఫాబాద్ జిల్లా జైనూర్ ఐసిడిఎస్ సిడిపిఓ ఇందిరా కోరారు. సోమవారం మండల కేంద్రంలోని కాశీ పటేల్ గూడా కమ్యూనిటీ హాల్లో సిడిపిఓ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ కేంద్రాల నిర్వహణ పోషకాహార అటెండెన్స్ రోజువారిగా నమోదు చేయాలని విధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని ఆమె కోరారు. ఎస్ ఎస్ ఎఫ్ టి కోఆర్డినేటర్ నరేష్ స0m మామ్ పిల్లల మెడికల్ అసైన్మెంట్ గురించి ఫాలో విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో కోఆర్డినేటర్ నరేష్, సూపర్వైజర్లు సృజన, సోంబాయి, హజీరా, సంధ్యారాణి, లింగమ్మ, జై నూర్, సిర్పూర్ (యు) లింగాపూర్ మండలాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
