హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
- సంగారెడ్డి నియోజకవర్గ అంశాలపై చర్చ
- ఇంద్రకరణ్ గ్రామ ప్రతినిధులతో కలిసి భేటీ
హైదరాబాద్/సంగారెడ్డి, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావును సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు కూడా ఆయన వెంట ఉన్నారు.
భేటీ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజా సమస్యలు, పార్టీ వ్యవహారాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అంశాలపై హరీశ్‌రావుకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వివరించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
