Tamil Politics | వేడెక్కిన తమిళ రాజకీయం..
Tamil Politics | వేడెక్కిన తమిళ రాజకీయం..
Tamil Politics | రజినీ భార్య లత ప్రజా వేదిక ప్రారంభం..
లారెన్స్ విజయ్ పార్టీలో చేరతారా?
అన్నామలై పార్టీ వెనకున్నది ఎవరు..?
Tamil Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. కోలీవుడ్ స్టార్ విజయ్ సీఎం అయిన తర్వాత కూడా రాజకీయాలు వేడక్కడం ఆసక్తిగా మారింది. సినీ, రాజకీయ వర్గాల్లో కొత్త సమీకరణాలపై చర్చలు జోరందుకున్నాయి. బీజేపీ నుంచి అన్నామలై బయటకు వచ్చి కొత్త పార్టీని అనౌన్స్ చేయడం.. సూపర్ స్టార్ రజినీ భార్య లత ప్రజా వేదిక ప్రారంభించడం.. నటుడు రాఘవ లారెన్స్ విజయ్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుండడం నేపధ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
Tamil Politics | విజయ్ పార్టీలోకి లారెన్స్..
తమిళనాడు సీఎం తిరుచ్చి ఈస్ట్ కు రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. అయితే.. తిరుచ్చి ఈస్ట్ సీటును విజయ్ స్నేహితురాలు త్రిషకు ఇస్తారని.. ఆమె పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ఊహించని విధంగా రాఘవ లారెన్స్ పేరు వినిపిస్తోంది. అయితే లారెన్స్ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. ఆయన విజయ్ రాజకీయ అడుగులకు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ ప్రచారం మరింత బలపడింది. ప్రచారంలో ఉన్న వార్తల పై లారెన్స్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తిరుచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే.. జూన్ 11న కీలక ప్రకటన చేస్తానని చెప్పారు కానీ.. తిరుచ్చి నుంచి పోటీ చేస్తున్నారా..? లేదా..? అనేది మాత్రం చెప్పలేదు. దీనిని బట్టి లారెన్స్ విజయ్ పార్టీలో చేరడం ఖాయం అనిపిస్తోందని టాక్.

Tamil Politics | అన్నామలై వెనకున్నది ఎవరు..?
మరో వైపు తమిళనాడు బీజేపీలో అన్నామలై చుట్టూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అన్నామలై బీజేపీని వీడిన తర్వాత ‘We The Leaders’ పేరుతో కొత్త ఉద్యమం ప్రారంభించారన్న వార్తలు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 24 గంటల్లోనే భారీ సంఖ్యలో ప్రజలు ఆయన కొత్త ఉద్యమంలో చేరినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో అన్నామలై ఏ మేరకు ప్రభావం చూపించనున్నారు..? ఆయన వెనకున్నది ఎవరు..? అనేది ఆసక్తిగా మారింది. మరో వైపు రజినీకాంత్ తన కలిసి రావాలని.. ఆయన పెట్టే పార్టీలో చేరాలని గతంలో అడిగారనే విషయం బయటపెట్టారు. దీంతో రజినీ ప్యాన్స్ సపోర్ట్ అన్నామలైకు ఉంటుందా..? ఉండదా..? అనేది ఆసక్తిగా మారింది.

Tamil Politics | బార్య లతను రంగంలోకి దింపిన రజినీ..?
ఇదిలా ఉండగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ పేరు కూడా రాజకీయ చర్చల్లోకి వచ్చింది. ‘మక్కళ్ మేడై’ పేరుతో కొత్త ప్రజా వేదిక ఏర్పాటు చేశారు. అన్నామలై కొత్త రాజకీయ పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత లతా రజినీకాంత్ ఈ వేదికను ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడులో సినిమా, రాజకీయాల మధ్య సంబంధం కొత్తది కాదు. ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ నుంచి కమల్ హాసన్, విజయ్ వరకు సినీ ప్రముఖుల రాజకీయ ప్రవేశాలు ఎప్పుడూ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు విజయ్ పార్టీ, లారెన్స్‌పై ప్రచారం, అన్నామలై కొత్త ఉద్యమం, లతా రజినీకాంత్ ప్రజా వేదిక.. ఇవన్నీ కలిసి తమిళ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. వచ్చే ఎన్నికల దిశగా తమిళనాడులో పార్టీలు వ్యూహాలు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో లారెన్స్ నిజంగా విజయ్ పార్టీలో చేరతారా? అన్నామలై ఉద్యమం రాజకీయ పార్టీగా మారుతుందా? లతా రజినీకాంత్ వేదిక సామాజిక ఉద్యమంగానే కొనసాగుతుందా? అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

