Minister | నియామకం..

Minister | నియామకం..
- టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎంపిక
Minister | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది. సూపర్ సిక్స్(Super Six) పథకాల అమల్లో భాగంగా, సుపరిపాలనలో తొలి అడుగు అనే అంశంతో భాగంగా ప్రజల వద్దకు అధికారులను ప్రజాప్రతినిధులను పంపారు. కొద్దిరోజులుగా జిల్లా అధ్యక్ష పీఠంపై ముడివీడిని సంఘటన బుధవారం చోటుచేసుకుంది.
నంద్యాల జిల్లా(Nandyal District)లో ఏడు నియోజకవర్గాల తోపాటు నంద్యాల పార్లమెంటు స్థానాన్ని కూడా టీడీపీ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సమయంలో జిల్లా అధ్యక్ష పీఠానికి పలువురు పోటీపడ్డారు. మంత్రి ఫరూఖ్(Minister Farooq) తనయుడు ఎన్‌ఎండీ ఫిరోజ్, ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసి రెడ్డి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డితో పాటు పలువురు పోటీపడ్డారు. మూడు నెలల క్రితం కమిటీకి దగ్గర నామినేషన్లు కూడా దాఖలు చేశారు.
చివరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక సమీకరణలో భాగంగా డోన్ నియోజకవర్గానికి చెందిన ధర్మవరం మన్నే సుబ్బారెడ్డిని టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శిగా మంత్రి తనయుడు ఫిరోజ్‌ను ఎంపిక చేశారు. మంత్రి తనయుడు ఇప్పటికీ ఈ పదవిలో ఉన్నారు. ఈ పదవిలో హ్యాట్రిక్(hat-trick) సాధించడం విశేషం. నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌లో ఉండటం కారణంగా ప్రజలకు, కార్యకర్తలకు ఫిరోజ్ అండగా ఉంటున్నట్టు తెలుపుతున్నారు.
ఈ పార్లమెంటరీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లాలోని టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలు నాయకులు కోరుతున్నారు. కొంతమంది ఈ అధ్యక్ష స్థానాన్ని ఆశించినప్పటికీ దక్కకపోవడం వారిలో నిరాశ నెలకొంది. వీరందరినీ సమన్వయం చేసుకొని పార్టీ అభివృద్ధికి(development) కృషి చేస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు.
