Bangladesh | బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు…

Bangladesh | బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు భారత్ సమన్లు…
Bangladesh | ఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో మరో ఉద్రిక్తత ఎదురైంది. బంగ్లాదేశ్‌లోని(Bangladesh) భారత దౌత్యాధికారులకు బెదిరింపులు రావడం నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లాకు సమన్లు జారీ చేసింది. ఇటీవల బంగ్లాదేశ్ నాయకుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు(comments) కూడా ఈ చర్యకు నేపథ్యమని తెలుస్తోంది.
కానీ ఏ విధమైన బెదిరింపులు అనేది ప్రత్యేకంగా పేర్కొనలేదు. అయితే.. ఇటీవల బంగ్లాదేశ్ నాయకుడు ఒకరు ఈశాన్య రాష్ట్రాల్ని ముట్టడి చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
