ఆదిత్యుని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి ఆఛేనాయుడు…
ఆదిత్యుని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి ఆఛేనాయుడు…
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : సోమవారం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని కుటుంబ సమేతంగా రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. మంత్రి గ విచ్చేసిన సందర్భంలో ఆయనకు ఆలయం అర్చకులు, వేదపండితులు, వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు.
వేదమంత్రాలతో మంత్రి ని ఆశీర్వదించి వారికి స్వామివారి ఛిత్రపఠం బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి తో పాటు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, ఒ.యస్.డి, రామచంద్రన్, ఆలయ సూపరింటెండెంట్ అట్టాడ. శ్రీనివాస్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
