CM | చంద్రబాబు ఆదేశం..

CM | చంద్రబాబు ఆదేశం..
CM, శ్రీకాకుళం ఆంధ్రప్రభ బ్యూరో : మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరు కావాలని సీఎం ఆదేశించారు. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. అప్పలసూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవితో మాట్లాడి ఆమెను ఓదార్చారు.
ఈ సందర్బంగా అప్పల సూర్యనారాయణతో ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా ఎప్పుడూ ఆయన సాధారణ జీవితమే గడిపారు అన్నారు. నిజాయితీగా ఆదర్శవంతమైన రాజకీయాలు చేసిన సూర్యనారాయణ అందరికీ ఆదర్శమన్నారు. పార్టీకి సూర్యనారాయణ చేసిన సేవలు ఎప్పుడూ మరిచిపోమని, వారి కుటుంబం పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని చంద్రబాబు తెలిపారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో చంద్రబాబు మాట్లాడుతూ.. అంత్యక్రియల కార్యక్రమం దగ్గరుండి చూడాలని చెప్పారు.

