ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్య పరీక్షలు
ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండలంలోని ఊరుకొండపేట ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో శనివారం 99రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇంచార్జ్ డాక్టర్ శివకృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, వృద్ధులు, వికలాంగులు పెద్ద ఎత్తున ఉప కేంద్రాన్ని చేరుకొని బీపీ , షుగర్, సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వారికి కావలసినటువంటి మాత్రలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో – ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తుందని దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వారంలో రెండు రోజులపాటు గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వారికి కావలసినటువంటి మందులు ఇవ్వడంతో పాటు అత్యవసరం అనుకున్నవారికి కల్వకుర్తి పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఏం ఊర్మిల ఆశాలు భాగ్య, మణెమ్మ, భాగ్యలక్ష్మి ఉన్నారు.
