బావిలో పడి మహిళకు గాయాలు..

ముత్తారం, ఆంధ్రప్రభ ; మండలంలోని ఇప్పలపల్లి( రామకృష్ణాపూర్ ) గ్రామానికి చెందిన తూండ్ల సుమతి (48) అకస్మాత్తుగా భావిలో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామునా రోజు వారి కూలికి సంసిద్ధం అయ్యే క్రమంలో వాకిలి శుద్ధి చేస్తుండగా కాలు అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడింది.

ఒక్కసారిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, ఇరుగు, పొరుగువారు వచ్చి మహిళను బావి నుండి సురక్షితంగా బయట తీసి 108 కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని బాధిత మహిళను ప్రధమ చికిత్స అందిస్తూ హిట్ థెరపీ ద్వారా మంథని లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది అయినా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, పైలెట్ హబీబ్ లకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply