Mahesh Babu Businessman | ప్రేక్ష‌కుల ముందుకు బిజినెస్‌మేన్‌

Mahesh Babu Businessman | ప్రేక్ష‌కుల ముందుకు బిజినెస్‌మేన్‌

సినీ థియేట‌ర్ల‌లో మ‌హేశ్‌బాబు అభిమానులకు సంద‌డి


Mahesh Babu Businessman | వెబ్ డెస్క్‌, ఆంధ్ర్ర‌ప్ర‌భ : తెలుగు సినిమాలో మహేష్ బాబు (Mahesh Babu) 46 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బిజినెస్‌మేన్ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. 2024 జ‌న‌వ‌రి 12లో విడుద‌లైన గుంటూరు కారం త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కూ సినిమాలు లేవు. ఇటీవ‌ల టైటిల్ విడుద‌ల చేసిన వార‌ణాసి 2027లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ఎక్కువ కాలం అభిమానుల‌ను నిరాశప‌ర్చ‌డం ఇష్టంలేక బిజినెస్ మేన్ ను ఈనెల 29న విడుద‌ల చేస్తున్నారు.

4కే అప్‌గ్రేడ్‌, మెరుగైన, రీమాస్టర్డ్ సౌండ్ తో విడుద‌ల చేస్తున్నారు. 2012 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుద‌లై బిజినెస్‌మేన్ (Businessman) సినిమా బాక్సాఫిసు సాధించింది. అప్ప‌ట్లో మ‌హేశ్‌బాబు అభిమానుల‌తోపాటు ప్ర‌తి ఒక్క‌రి ప్ర‌శంసాలు పొందింది. సూర్య‌భాయ్‌గా మ‌హేశ్‌బాబుతో న‌టించిన‌ చిత్ర భ‌ర‌ద్వాజ్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చిత్ర తండ్రి అజ‌య్ భ‌ర‌ద్వాజ్ (క‌మిష‌న‌ర్ ) పాత్ర‌లో నాజ‌ర్ న‌ట‌న ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల మ‌దిలో చిర‌స్థాయిగా ఉండిపోయాయి. అలాగే సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ఇచ్చిన మ్యూజిక్ కుర్ర‌కారుల‌ను ఊర్రుతూలూగించింది. పూరీ జ‌గ‌న్నాథ్ కు పేరు తెచ్చిన సినిమాల్లో ఇదొక‌టి.


బిజినెస్‌మేన్ సినిమా యాక్షన్ క్రైమ్ చిత్రం (Action crime film). దీనిని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించి, ఆర్.ఆర్. మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆర్.ఆర్.వెంకట్ తెర‌కెక్కించారు. మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నాసర్, సాయాజీ షిండే, రాజా మురాద్, సుబ్బరాజు, బ్రహ్మాజీ త‌దిత‌రుల‌ తారాగణం నటించింది. ఈ చిత్రంలో, దేశంలోని అవినీతి వ్యవస్థపై ద్వేషం కారణంగా నగరాన్ని పాలించాలనే ఆకాంక్షతో విజయ్ సూర్య ముంబైకి వస్తాడు. కానీ పోలీసులు అతని శత్రువుల నుండి హింసాత్మక సవాళ్లను ఎదుర్కోవడం ప్రారంభిస్తాడు.


ఈ చిత్రం రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఆగస్టు 15, 2011న హైదరాబాద్‌(Hyderabad) లో షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. సెప్టెంబర్ 2, 2011 నుంచి హైదరాబాద్, ముంబై , గోవా, బ్యాంకాక్‌లో చిత్రీకరించారు. చిత్రీకరణ డిసెంబర్ 10, 2011న 74 పని రోజుల్లో ముగిసింది. ఇది ఒక తెలుగు సినిమా చిత్రీకరించిన అతి తక్కువ వ్యవధిలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా అసలు విడుదలలో రూ.71 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా గతంలో 2023 ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తిరిగి విడుదల చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం మ‌హేశ్‌బాబు అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply