may16bjp | దక్షిణాదిలో బీజేపీకి కొత్త వ్యూహం అవసరమా?
may16bjp | దక్షిణాదిలో బీజేపీకి కొత్త వ్యూహం అవసరమా?
may16bjp | తమిళనాడులో ద్రవిడ రాజకీయాల మార్పు
అన్నామలై పాత్రపై బీజేపీ వ్యూహాత్మక తప్పిదం
దక్షిణాదిలో మత, సామాజిక సమీకరణాల ప్రభావం
క్రైస్తవ మత వ్యాప్తి, రాజకీయ ప్రభావం
దక్షిణాదిలో బీజేపీ భవిష్యత్ వ్యూహం
may16bjp | తమిళనాడులో సినీనటుడు, మెగాస్టార్ విజయ్ నెలకొల్పిన తమిళగ వేట్రి కళగం (టివికె) రాజకీయపార్టీ రాష్ట్రంలో ద్రవిడజాన్ని క్రమంగా కనుమరుగు చేయనున్నదా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకెకి 35శాతం ఓట్ షేర్ రాగా, రెండు ద్రవిడ పార్టీలకూ కలిపి 45 శాతం వచ్చింది. 2021లో రెండింటికీ కలిపి 70 శాతం ఓట్ షేర్ వచ్చింది. ద్రవిడ పార్టీల ఉనికిని వలసపాలనలో కృత్రిమంగా ఏర్పాటు చేశారు. జాతిపరంగా భారతీయుల్లో ఉత్తరాది ఆర్యులకూ, దక్షిణాది ద్రావిడులకూ మధ్య విభజన రేఖను సృష్టించారు. కులపరంగా కూడా బ్రాహ్మణ వ్యతిరేక వాదంను లేవదీశారు. తమిళ రాజకీయనాయకులు తమ ప్రతిపత్తిని చాటుకోవడానికి ఉత్తరాది, దక్షిణాది భేదభావంను లేవదీశారు. హిందూ మత పరమైన సంబంధాలు ఆధారంగా ముఖ్యంగా, దక్షిణ భారత దేశంలో ఆలయాల సంస్కృతి, సంబంధాల ఆధారంగా విభేదాలును లేవదీశారు. తమిళనాడు వెలుపల ఇది లేకపోవచ్చు కానీ, అంతర్గతంగా ఈ విభేదాలు ఇంకా ఉన్నాయి.
తమిళనాడులో రాజకీయాలు పెరియార్ బోధనలు ఆధారంగా పాతుకుని పోయాయి. ద్రవిడ పార్టీలు రెండు అవసరం వచ్చినప్పుడు ఈ ద్రవిడ వాదాన్ని రాజకీయ అవసరం కోసం లేవదీస్తూ ఉంటాయి. తమ మధ్య ఐక్యత కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ద్రవిడ వాదాన్ని పైకి తెస్తుంటాయి.
దీంతో దక్షిణాదిన బీజేపీ ఎదగడానికి అవరోధంగా ఉంది. దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలమైన పునాదులుతో వృద్ధి చెందడానికి, ఆ పార్టీ వేరే వ్యూహంను అనుసరించాల్సి ఉంది. ఉత్తరాదిన, పశ్చిమాన, తూర్పున ఏ విధంగా అయితే, వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తోందో దక్షిణాదిన కూడా అదే మాదిరి వేర్వేరు వ్యూహాన్ని అనుసరించాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు కె అన్నామలైని బీజేపీ కేంద్ర నాయకత్వం పక్కన పెట్టింది. ఆయన కర్నాటకలో యెడియూరప్ప, అసోంలో హిమంత్ బిశ్వా శర్మ, పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి మాదిరిగా పార్టీకి బలమైన నాయకత్వంను అందించి ఉండేవారు. వీరిలో ఎవరికీ ఆర్‌ఎస్‌ఎస్ పునాదులు లేవు. అదే మాదిరిగా అన్నామలై కూడా పార్టీకి గట్టి నాయకత్వంను అందించి ఉండేవారు.
అన్నామలై గురించి ఆలోచించేటప్పుడు దక్షిణాదిన బీజేపీ రాజకీయాల గురించి పరిశీలిద్దాం. మొగలాయీల కాలంలో ఉత్తరాది మాదిరిగా దక్షిణాదిన ముస్లిం పాలకులు హిందూ ఆలయాలను అంత తీవ్రంగా కూలగొట్టలేదు. ప్రతిరాష్ట్రానికీ వేర్వేరు చరిత్ర ఉంది. ఉత్తరాది కన్నా, దక్షిణాది చరిత్ర వేరుగా ఉంది. బంగ్లాదేశ్ విషయమే తీసుకుంటే, అక్కడ ముస్లింలు, హిందువు శరణార్ధులు రెండు వర్గాల్లోనూ ఉన్నారు. అసోం, బెంగాల్‌లలో కూడా హిందువుల సంఖ్య పెరగడం వల్ల ముస్లిం మైనారిటీల ప్రాబల్యం తగ్గింది. బెంగాల్‌లో ముస్లింల జనాభా 27శాతం, అసోంలో 34 శాతం ఉన్నారు.
హిందూ, ముస్లిం జనాభా సమీకరణ జరిగింది. ఇది కాక, గిరిజనులు, కులాల ప్రతిపత్తి, ఇతర అంశాలు కూడా ప్రజల్లో విభజనకు దారి తీశాయి.
దక్షిణాదిన మత పరమైన ముప్పు హిందూ ప్రతిపత్తికి వచ్చింది. మసీదుల వల్ల కాదు, చర్చిల వల్ల. దక్షిణాదిన మతపరమైన మార్పిడులు ఎక్కువగా జరిగాయి. హిందువులు క్రైస్తవ మతంలోకి మారడంతో ఈ మార్పు వచ్చింది. దక్షిణాదిన క్రైస్తవ వ్యతిరేకత లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో అనేక చోట్ల క్రైస్తవ మత వ్యాప్తి జరిగింది. ఉదాహరణకు కేరళలో ఎక్కువమంది క్రైస్తవాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిలకు ఎవలాంజికల్ సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కల సేకరణ తర్వాత క్రైస్తవుల సంఖ్య కచ్చితంగా ఎంతుందో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు తెలంగాణలో 6.8 లక్షలు ఉన్నారని పరిశోధకుడు సి.సురేంద్ర నాథ్ తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రైస్తవులు 10 నుంచి 12 శాతం ఉన్నారు.
తమిళనాడులో క్రైస్తవుల చర్చి చాలా బలమైనది. రాష్ట్రంలో జనాభా లెక్కల కంటే క్రైస్తవుల జనాభా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు క్రైస్తవులు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. వైఎస్‌ఆర్, ఆయన తనయుడు జగన్‌లు ముఖ్యమంత్రులుగా పని చేశారు. తమిళనాడులో ఇప్పుడు జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాడులో మౌలికంగా డిఎంకె నాయకత్వం హిందువులు అయినప్పటికీ, వారంతా నాస్తికులు, అందువల్ల దక్షిణాది, ఉత్తరాది రాజకీయ వేత్తల మధ్య మౌలికమైన తేడా ఉంది.
తమిళనాడులో అన్నామలై వంటి వారిని ఆధారం చేసుకుని బీజేపీ తమ పార్టీబలాన్ని పెంచుకోవాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. యెడియూరప్ప, అన్నామలైల వంటి వారిని ఆసరాగా చేసుకుని బీజేపీ దక్షిణాదిన ఎదగాల్సింది. అలాగే, దక్షిణాదిన బీజేపీ నాయకుల్లో జనాకర్షణ శక్తిగలవారు లేకపోవడం ఒక లోపం. అయినప్పటికీ అన్నామలైని అసోంలో హిమంత్ బిశ్వ శర్మను ఉపయోగించుకున్నట్టుగా పార్టీ విస్తృతికి ఉపయోగించుకుని ఉండాల్సింది.
-ఆర్ జగన్నాథన్@thejaggi
ఎడిటర్, స్వరాజ్ మ్యాగజేన్ మాజీ ఎడిటోరియల్ డైరెక్టర్
