ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ

Interesting discussion among people I ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ
ఆంధ్రప్రభ వెబ్ (జాతీయం) : పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ప్రజలపై నెమ్మదిగా భారాలు మోపుతూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే పేద, మధ్య తరగతి ప్రజలు పెట్టుబడికి ఉపయోగపడే విధంగా కొనుగోలు చేస్తున్న బంగారం ధరలు పెరిగేలా ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచింది. దీంతో మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. అలాగే పెట్రో ఉత్పత్తుల పొదుపుపై ప్రచారం చేస్తూ వాటి ధరలను ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెంచాయి. మరికొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు అనే చర్చ జరుగుతుంది. ఈ రెండింటి తర్వాత ఇంకా ఏయే వస్తువుల ధరలు పెరగబోతున్నాయన్న చర్చ కూడా ప్రారంభమైంది.
ప్రజలకు హితబోద చేస్తూ…
ప్రధాని మంత్రి ప్రజలకు హిత బోద చేస్తూ వాటి ధరలను పెంచుతున్నారు. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని హైదరాబాద్‌లోని బహిరంగ సభలో ప్రధాన మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరుచటి రోజు గుజరాత్‌లో పర్యటించిన ఆయన బంగారం కొనుగోలు చేయొద్దని పునరుద్ఘాటించారు. దీనిపై దేశ ప్రజల్లో చర్చ మొదలైంది. ప్రధాని వాఖ్యలపై బీజేపీ, విపక్షాలు సానుకూలంగా స్పందించగా, ప్రతిపక్షపార్టీ కాంగ్రెస్‌తోపాటు మిగిలిన వారు విమర్శలు గుప్పించారు. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు అదపు చేయకుండా కొనుగోలు చేయొద్దని పిలుపు ఇస్తే ఎలా అని మహిళలు ప్రశ్నించారు. అక్కడకు రెండు రోజులు పోయాక బంగారంపై సుంకం భారీగా పెంచారు. బంగారం, వెండి, ప్లాటినంపై సుంకం ఆరు శాతం నుంచి పదిహేను శాతం వరకూ పెంచారు. అలాగే అవే సభలో ప్రధాని మాట్లాడుతూ పెట్రో ఉత్పత్తులు వాడకం తగ్గించాలని కూడా ప్రజలకు సూచించారు. అవసరమైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించుకోవాలన్నారు. పెట్రో ఉత్పత్తులు పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుతో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. ప్రధాని మంత్రితోపాటు ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్లు తమ వాహనాల సంఖ్య కుదించారు. ఒక వైపు పొదుపు మంత్రం చెబుతూ మరో వైపు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు..
భారత దేశంలో అత్యధికంగా మార్కెట్ ఉన్న ఎలక్ట్రానికి వస్తువులపై కేంద్ర దృష్టి సారించే అవకాశం ఉందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలో మొదటిగా అత్యంత విలువైన బంగారంపై దిగుమతి సుంకం పెంచడం, పశ్చిమాసియ ఉద్రికత్తలతో ప్రపంచంలో పెరుగుతున్న ఆయిల్ ధరలకు అనుగుణంగా దేశంలోకూడా ఆయిల్ ధరలు పెంచడం జరిగింది. ఇక మిగిలింది ఎలక్ర్టానిక్ వస్తువులు. దేశంలో అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. సెల్ ఫోన్, ఐ ఫోన్, క్యూఎల్‌డీ మోడల్ టీవీలు, కంప్యూటర్లు, వాచీలు, ల్యాప్‌టాప్‌లకు మంచి గిరాకీ ఉంది. వీటి ధరలు పెరిగే అవకాశం ఉందని వినియోగదార్లులో ఒక ఆందోళన ఉంది.
