Maternity Leave Men AP : మగాళ్లకూ మెటర్నిటీ లీవ్ AP SPl News

Maternity Leave Men AP : మగాళ్లకూ మెటర్నిటీ లీవ్ AP SPl News
- ఏపీ భర్తలకు ఉమెన్స్ డే గిస్ట్
- ఏపీ సీఎం సంచలన ప్రకటన
- ఉమ్మడి కుటుంబాలకూ వరాల జల్లు
- త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు
- 60 కిలోల ఉచిత బియ్యం
- డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు..
- నేనే బ్రాంబ్ అంబాసిడర్ అని డిక్లేర్
- ఇంటింటికీ ఓ పారిశ్రామిక వేత్త లక్ష్యం
- పేదరికం నిర్మూలనే ధ్యేయం
- 6,81,506 మంది మహిళలకు సబ్సిడీ రుణాలు
- ₹ 10,100 కోట్ల మెగా చెక్ అందజేత
- ఆద్యంతం ఆకట్టుకున్న సీఎం చంద్రబాబు
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి)

మహిళలకే కాదు, ఇద్దరు పిల్లలు ఉంటే.. మగాళ్లకూ మెటర్నిటీ లీవ్ ఇస్తాం, అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ దినోత్సవ సభలో భర్తలకూ ఉమెన్స్ డే గిప్ట్ ను ప్రకటించి .. మహిళల్లో చిరునవ్వులు చిందించారు. మహిళల సాధికారిత , హక్కులు గురించే కాదు.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అవసరాన్ని వివరించారు. అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా మహిళా మణులు తరలి వచ్చారు. మహిళల హక్కులు, న్యాయం, చర్యలు అనే థీమ్‌తో ఈ సారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకగా సాగింది. విద్యార్థినులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ర్యాంప్ వాక్ చేశారు. మహిళలకు అభివాదం తెలిపారు.

ర్యాంప్ వ్యాక్ చేస్తూ పలువురు మహిళల అభ్యర్ధనలను స్వీకరించి సీఎం చంద్రబాబు ఆకట్టుకున్నారు. సెర్ప్, డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన రుణాలతో ఔత్సాహికులుగా ఎదిగిన మహిళల ఆడియో-వీడియో ప్రదర్శించి అభినందించారు. ఐదుగురు ఉత్తమ ఎంట్రపెన్యూర్‌లకు సన్మానం చేశారు.

మహిళల అభివృద్ధికి వివిధ సంస్థలతో డ్వాక్రా, మెప్మా సెర్ప్ విభాగాలు కుదుర్చుకున్న 26 ఎంఓయూలు, మెప్మా కుదుర్చుకున్న 12 ఎంఓయూలను వర్చువల్‌గా ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ₹ 10,100 కోట్ల మెగా చెక్ ను అందజేశారు. 6,81,506 మంది మహిళలకు సబ్సిడీ రుణాలను అందించారు. ఇక అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా.. సీఎం చంద్రబాబు ఆద్యంతం తన ప్రసంగంతో తెలుగింటి ఆడబిడ్డలను ఆకట్టుకున్నారు. మహిళల హక్కల సంరక్షణ, స్వయం ఉపాధి, సంక్షేమం వరకూ.. తెలుగుదేశం పార్టీ విధానాలను వివరించారు. మరీ ముఖ్యంగా .. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి కుటుంబాలకు వరాలు కురిపించారు. పాపులేషన్ మేనేజ్ మెంట్ అవసరాన్ని వివరించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ,

Maternity Leave Men AP | ఉమ్మడి కుటుంబాలే పెద్ద సంపద
భారత్ లో ఉమ్మడి కుటుంబాలే అతిపెద్ద సంపద. రేషన్ కోసం, పెన్షన్ కోసం, ఇంటి కోసం విడిపోకూడదు. తల్లితండ్రులు ఇప్పుడు పెద్ద వయస్సుల్లో ఒంటరిగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. అదనంగా పెన్షన్, ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లను, 60 కేజీల వరకూ రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం.
Maternity Leave Men AP | మగాళ్లకూ మెటర్నిటీ లీవ్ ఇస్తాం

మహిళలకే కాదు…ఇద్దరు పిల్లలుంటే మగవారికి కూడా రెండు నెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తాం . 58 శాతం మంది ఒక్క బిడ్డకే పరిమితం అవుతున్నారు. కొందరు అసలు వద్దనుకుంటున్నారు. . అందుకే పాపులేషన్ మేనేజ్మెంట్ అమలు చేయాలని భావిస్తున్నాం మహిళలు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలి. సుపరిపాలనతోనే మెరుగైన ఆదాయం వస్తుంది. తద్వారా సంక్షేమం అందించే అవకాశం ఉంటుంది. మహిళా అభివృద్ధి కోసం ఓ బ్లూప్రింట్ కు రూపకల్పన చేశాం. వచ్చే ఏడాదికి 6 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తాం. అని సీఎం చంద్రబాబు అన్నారు.
Maternity Leave Men AP | ఇంటింటికీ ఓ పారిశ్రామికవేత్త లక్ష్యం

ప్రతీ ఇంటి నుంచి ఎంఎస్ఎంఈలు ఆవిష్కృతం కావాలి. అందులో 50 శాతం మంది మహిళలే ఉండాలన్నది నా ఆకాంక్ష . మహిళ సంఘాలు, ఎంఎస్ఎంఈలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు వెళ్లాలి ఎక్కడో జరుగుతున్న యుద్ధం మన మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి . ఈ సమస్యలు వచ్చినా దీనిని సమర్ధంగా ఎదుర్కోంటాం.

హనుమంతుని శక్తిలా ఆడబిడ్డల శక్తి వారికి తెలీదు. మహిళల్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతాం. ఎస్ఎహ్ జీలు తయారు చేసిన స్వయం బ్రాండ్ ను ప్రతిష్టాత్మక బ్రాండ్ గా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడతాం. మహిళలకు శక్తి సామర్ధ్యాలను ఇచ్చిన పార్టీ టీడీపీనే. ఇంటి స్థలాలు, రుణాలను, సంక్షేమ పథకాలను కూడా వారి పేరిటే ఇస్తున్నాం తాము ఆరోగ్యంగా ఉండటంతో పాటు కుటుంబాన్ని, సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మహిళలదే, అని సీఎం వివరించారు.
Maternity Leave Men AP | 30 ఏళ్ల కిందటే ఆడపిల్లకు బాట

1997లో ఆడబిడ్డ పుడితే భారమనే రోజుల్లోనే ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం తెచ్చి రూ.5 వేలు డిపాజిట్ చేశాం. స్కూల్‌కు వెళ్లే 8,9,10 తరగతి విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించాను. డ్వాక్రా సంఘాలు, మెప్మా సంఘాలను చూసి గర్వపడుతున్నా. ఎన్నో వ్యవస్థలు నష్టపోయినా డ్వాక్రా, సంఘా వ్యవస్థలు బలంగా ఉన్నాయి. సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి… అవన్నీ పోవాలి. గృహ హింస వంటి అంశాలపై డ్వాక్రా సంఘాల్లో చర్చ జరగాలి.

కుటుంబాలు బాగుండాలి. ప్రతీ ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత స్వయం సహాయక సంఘాలది. 2024లో కూటమి వచ్చాక ఎంతమంది బిడ్డలున్నా తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇచ్చి గౌరవించాం. స్త్రీశక్తితో బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం… 50 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. వంట చేసుకోవడానికి కష్టాలు పడ్డారు. గతంలో గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు 3 సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తున్నాం. యుద్ధం కారణంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో సిలిండర్ రేట్ పెరిగినా ఆడబిడ్డలకు ఉచితంగానే సిలిండర్లు అందిస్తాం. అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Maternity Leave Men AP | మీ బ్రాండ్ అంబాసిడర్ నేనే

లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తామని చెప్పాం. 1,12,686 మంది మహిళలు ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో 33,899 మంది ఏర్పాటు చేశారు. ఇది చూసి చాలా సంతోషించా. కొందరు అప్పులు తీసకుని చెల్లించరు. కానీ డ్వాక్రా, మహిళలు అప్పులు తీసకుంటే తిరిగి చెల్లించే వ్యవస్థ మనది. ఒకసారి రుణాలు చెల్లిస్తే… రెండోసారి మరిన్ని రుణాలు అందిస్తారు. 84.66 లక్షల మంది డ్వాక్రాలో సభ్యులుగా ఉన్నారు. 8.34 లక్షల సంఘాలు ఉన్నాయి.
ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని సంకల్పించాం. మంచి పనికి సంకల్పం తీసుకుంటే సాధించేవరకు పని చేసేది తెలుగింటి ఆడబిడ్డలే.

రూ.21 వేల కోట్లు కార్పస్ ఫండ్ కింద మీ వద్ద ఉంది. మెప్మా సంఘాలు ఉన్నాయి.. వారినీ అభివృద్ధి చేస్తున్నాం. కొత్త బ్రాండ్ ఇప్పుడే ప్రారంభించాం… స్వయం మీ బ్రాండ్. అందులో మీ ఫోటోనే ఉంటుంది. 1.10 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు.
డ్వాక్రా సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మహిళలే వినియోగించుకోవాలి. దీని ద్వారా 3.30 కోట్ల మంది వినియోగించుకుంటారు. మన బ్రాండ్లు బాగుంటే ప్రపంచమంతా మన వద్దకు వస్తుంది. స్వయం బ్రాండ్ ను గ్లోబల్ బ్రాండ్ గా మార్చే బాధ్యత మేం తీసుకుంటాం. బ్రాండ్ చాలా ముఖ్యం. మంచి బ్రాండ్ ఉంటే తీసుకుంటారు. నాణ్యత ఉండాలి… ప్యాకేజింగ్, రెసిపీ విధానం మెరుగు చేసుకోవాలి. మెషనరీ ఇప్పించే బాధ్యత నాది, ఊళ్లల్లోనే కూర్చుని ఉత్పత్తులు తయారు చేసే బాధ్యత మహిళలది… దానికి మార్కెటింగ్ కల్పించే బాధ్యత మాది. మహిళలు స్వయం బ్రాండ్లను అమ్మాలి.. స్వయం ఉత్పత్తలనే వినియోగించాలి. డ్వాక్రా మహిళల స్వయం బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా. 37 ఎంఓయూలు ఈ రోజు చేసుకున్నాం… మార్కెట్లు, క్వాలిటీ పెంచడానికి, టెక్నాలజీ వినియోగానికి ఎంఓయూలు చేసుకున్నాం. ఈ రోజు నుంచి వచ్చే ఏడాదికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తాం. గత ఏడాది 1 లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేశాం. అని చంద్రబాబు ఆకట్టుకున్నారు.
Maternity Leave Men AP | సొంత కంపెనీతో వచ్చాం

రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మేం నిర్వహిస్తున్న కంపెనీని నిర్వహించాలని నా సతీమణిని కోరాను. మొదట్లో నిరాకరించినా ఇప్పుడు ఆమె, బ్రాహ్మణితో కలిపి హెరిటేజ్ ను అద్భుతంగా నడుపుతున్నారు. హెరిటేజ్ నుంచి వస్తున్న సంపాదనతో గౌరవంగా రాజకీయం చేస్తున్నాం. నా సతీమణి, నా కోడలు మాదిరిగానే ప్రతీ ఇంట్లోని ఆడబిడ్డ పారిశ్రామిక వేత్తలుగా ఉండాలనేది నా ఆకాంక్ష. వెలుగు ప్రాజెక్టు కింద స్వయం సహాయ సంఘాలను తీసుకువచ్చి పేదరికం నుంచి పైకి తీసుకు వస్తాం. పీ4 ద్వారా 10 లక్షల బంగారు కుటంబాలను 1 లక్ష మంది మార్గదర్శుల ద్వారా సాయం అందిస్తున్నాం పేదల జీవన ప్రమాణాలు పెరగాలన్నదే నా లక్ష్యం. అని సీఎం చంద్రబాబు బావోద్యేగంతో అన్నారు.
Maternity Leave Men AP | ఆడపిల్ల జోలికి వస్తే… అదే ఆఖరి రోజు

మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు. గత పాలకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లను తయారు చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని పదేపదే హెచ్చరిస్తున్నాను. మీకు అవసరమైన వెంటనే మన మహిళా హోం మంత్రి వెంటనే స్పందిస్తున్నారు. మహిళల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధపెడుతున్నాం. సర్వైకల్, బ్రెస్ట్ కాన్సర్లు వస్తున్నాయి. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, అని సీఎం చంద్రబాబు నాయుడు మహిళామణులను ఆకట్టుకున్నారు
ALSO READ : Google Data Center Vizag : అమరావతిలో 9 సిటీస్ Andhra Prabha News
