Google Data Center Vizag : అమరావతిలో 9 సిటీస్ Andhra Prabha News

Google Data Center Vizag : అమరావతిలో 9 సిటీస్ Andhra Prabha News

  • డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రణాళికలు
  • ఇక అమరావతి క్వాంటం వ్యాలీ
  • విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి..
  • రైసినా డైలాగ్‌లో సీఎం వెల్లడి
  • AI, క్వాంటం టెక్నాలజీతో ఏపీ భవిష్యత్..
  • ప్రపంచ వేదికపై చంద్రబాబు విజన్
  • గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి.. భవిష్యత్‌లో విద్యుత్ ఎగుమతి
  • మినీ కాదు.. మెగా ఫ్యామిలీ కావాలి
  • జనాభా పాలసీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
  • రైసినా డైలాగ్‌లో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

( ఆంధ్ర‌ప్ర‌భ‌, న్యూఢిల్లీ ప్ర‌తినిధి)

Google Data Center Vizag

రైసినా డైలాగ్ 2026 సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేస్తామని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులు, గ్రీన్ ఎనర్జీ, ఏఐ టెక్నాలజీపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు.అభివృద్ధి సాంకేతికత రంగం వైపు భారత్​ శరవేగంగా దూసుకు వెళ్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2016 నుంచి నిర్వహిస్తున్న రైసినా డైలాగ్ 2026 సదస్సులో తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని రైసినా డైలాగ్ నిర్వాహకులుచ ఆహ్వానం పలికారు. 110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు , కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సహా ఇతర ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

Google Data Center Vizag

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మూడు దశాబ్దాల కిందట అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు తెలుగు రాష్ట్రాల నిపుణులను అందించిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. నాలెడ్జి ఎకానమీలో లీడింగ్ భాగస్వామిగా భారత్ ఉందని 60 శాతం జీసీసీలు భారత్ లో ఏర్పాడ్డాయని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీ సంస్కరణలతో యూపీఐ పేమెంట్ వ్యవస్థ కూడా కీలకంగా మారిందన్న సీఎం చంద్రబాబు వివరించారు. గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటునకు ముందుకు వచ్చిందని సీఎం తెలిపారు.

Google Data Center Vizag : ఇక క్వాంటం విప్లవం

Google Data Center Vizag

క్వాంటం కంప్యూటింగ్ తో అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా తయారు చేసి ప్రపంచానికి అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ విప్లవం అందిపుచ్చుకున్నప్పుడు అంతా విమర్శించారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నాలెడ్జి ఎకానమీకి కేంద్రంగా మారింది, ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది గేమ్ చేంజర్ గా మారబోతోంది. ఏఐ, క్వాంటం కంప్యూటర్లను ఎలా వినియోగించుకుంటామన్న అంశం ఆధారంగానే వాటి భవిష్యత్తు మారుతుంది.

Google Data Center Vizag

సైబరాబాద్ తో పాటు అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మించే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు, అని సీఎం చంద్రబాబు నాయుడు బావోద్వేగంతో వివరించారు. టెక్నాలజీని, ఇన్ ఫ్రాను మిళితం చేసి కాలుష్య రహిత నగరంగా అమరావతిని నిర్మిస్తున్నాం, ప్రముఖ ఐటీ కంపెనీలను భారతీయులే లీడ్ చేస్తున్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం, అని సగర్వంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Google Data Center Vizag : సహనం అనే పునాది…

Google Data Center Vizag

సహనం అనే పునాదులపై భారతీయ సంప్రదాయ మూలాలు ఉన్నాయి. సహకార ఫెడరలిజం అనే అంశంపై కేంద్ర, రాష్ట్రాలు పనిచేస్తున్నాయి. వివిధ రకాల సంస్కరణల ద్వారా వచ్చిన వివిధ పాలసీలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తాయి. అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలను కూడా అత్యున్నతంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడుతున్నాం, అని సీఎం వివరించారు.

Google Data Center Vizag : భారతీయులే అత్యుత్తమ డిప్లోమేట్స్​

Google Data Center Vizag

ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులే అత్యుత్తమ డిప్లామాట్స్. ఎక్కడికి వెళ్లినా స్థానికులతో కలిసి మెలిసి నివసించటంలో వారికి మించిన వారులేరు . ప్రపంచ దేశాలకు విస్తృత సేవలు అందిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువ. ప్రత్యేకించి ఐటీ సహా వివిధ రంగాల్లో గ్లోబల్ కమ్యూనిటీకి, ప్రపంచ సంక్షేమానికి భారతీయులు సేవలు అందిస్తున్నారు. గతంలో భారతీయ నిపుణులు సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు మేధో వలస జరిగింది. కానీ త్వరలో రివర్స్ మై గ్రేషన్ అంటే ఏమిటో మొదలవుతుందిచ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Google Data Center Vizag : విద్యుత్తు ఎగుమతిలోనూ రాటు తేలుతాం

Google Data Center Vizag

నిపుణులు, వనరులు ఉన్న చోటుకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం దూరాలు అనేవి ఒక అంశం కాదు. ఎక్కడి నుంచైనా పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయి. నాలెడ్జ్ ఎకానమీలో భాగంగా ఎక్కడైనా ఓ పెద్ద కంపెనీని ప్రారంభించి పనిచేసేందుకు అవకాశం ఉంది. త్వరలో డేటా సెంటర్ ల కోసం గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాం. భారత్ లో ప్రస్తుతం సింగిల్ గ్రిడ్ ద్వారా ఎనర్జీ ట్రాన్సఫర్మేషన్ జరుగుతోంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ తో పాటు ఇతర సంప్రదాయ విద్యుత్ కారిడార్ లు ఉంటాయి, అని సీఎం చంద్రబాబు వివరిం చారు, త్వరలోనే భారత్ విద్యుత్ ను ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గ్రీన్ అమ్మోనియా కూడా ఏపీలో ఉత్పత్తి చేస్తున్నాం, ఏఐ సహా క్వాంటం ఏఐ ఆల్గారిథమ్స్ కోసం పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి. ఇటీవల ట్రైనింగ్ కోసం కోసం పిలుపు ఇస్తే 50 వేల మంది రిజిస్టర్ చేసుకుని శిక్షణ పొందుతున్నారు

Google Data Center Vizag : మినీ కాదు.. మెగా ఫ్యామిలీ అవసరం

Google Data Center Vizag

వయో భార సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకే ఫెర్టిలిటీ రేటును పెంచేలా పాపులేషన్ మేనేజ్ట పాలసీని రూపొందించాం. 1.5 నుంచి 2.1కు ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్ధిక సాయం, నెలలవారీగా రూ.1 వెయ్యి అందించాలని నిర్ణయించాం. అలాగే చైల్డ్ కేర్ లీవ్ లాంటి ప్రోత్సాహకాలను అందించాలని ఆలోచన చేస్తున్నాం ఓ ప్రజాప్రతినిధిగా గతంలో జనాభా నియంత్రణ పై మాట్లాడాను. ఇప్పుడు భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించి జనాభా నిర్వహణ పాలసీని ప్రోత్సహిస్తున్నాను. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఇప్పుడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్ లో గతంలో పెద్ద కుటుంబ వ్యవస్థలు ఉండేవి. దేశానికి అదో పెద్ద ఆస్తి కూడా. ప్రస్తుతం మైక్రో ఫ్యామిలీలుగా మారాయి. ఈ విషయంలో ప్రజల దృష్టి కోణం మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నాం, అని కుటుంబ వ్యవస్థపై భావోద్వేగంగా సీఎం చంద్రబాబు నాయుడు విశధీకరించారు.

Google Data Center Vizag : అమరావతిలో 9 సిటీస్​

Google Data Center Vizag

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నత స్థానాల్లో ఉండడానికి 30 ఏళ్ల కిందట తీసుకున్న వివిధ సంస్కరణలతో కూడిన నిర్ణయాలే కారణం. నాలెడ్జి ఎకనామీ ద్వారా ప్రపంచ దేశాలకు నైపుణ్యాలను అందిస్తున్నాం. త్వరలోనే ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ద్వారా ప్రపంచానికి అత్యుత్తమ ఉత్పత్తులను సరఫరా చేస్తాం. 9 అంశాలతో కూడిన నగరాలను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం. క్రియేటివ్ సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ప్రైవేటు శాటిలైట్లను కూడా తయారు చేసి లాంచ్ చేసేలా ఓ స్పేస్ సిటీని, డ్రోన్ల కోసం డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్ సిటీని ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్ అనేది రియాలిటీ, క్యూరేటివ్ విధానంపైనా అంతా దృష్టి సారించాల్సి ఉంది. డ్రోన్ అంబులెన్స్ కూడా త్వరలోనే రియాలిటీగా మారబోతోంది. మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు ఇచ్చిన ఆలోచనల్ని అమలు చేసేందుకు భారత్ తో పాటు ఏపీ సదా సన్నద్ధంగా ఉంటుంది, అని సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

ALSO READ : cbn 2047 vison : అప్పుడు విధ్వంసం Andhta Prabha Assebly News

Leave a Reply