March fast | ఎన్నికలతో పోలీసుల మార్చ్ ఫాస్ట్..
- నేరాలు చేసి బాధపడొద్దు ఎస్సై ఇంద్రవెల్లి
March fast | ఇంద్రావెల్లి, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల దృష్ట్యా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని మండల కేంద్రంతో పాటు ఈశ్వర్ నగర్ ముత్మూర్, ధనురా భి తదితర గ్రామాల్లో మార్చ్ ఫాస్ట్(March fast)ను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై ఈ సాయన్న ఆధ్వర్యంలో వివిధ వీధుల్లో మార్చ్ ఫాస్ట్ చేస్తూ.. సర్పంచ్ ల ఎన్నికలు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
ఓటర్లకు ఎలాంటి ప్రలోభాలకు, భయం భ్రాంతులకు గురి చేయకుండా చూడాలన్నారు. అటువంటి ప్రలో భలకూ పాల్పడిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నేరాలు చేసి బాధపడవద్దని, అలాగే పంచాయతీలలో ప్రభుత్వపరంగా నామినేషన్ చేసే హక్కు ఉందని ఇందులో బలవంతత పెట్టి విడ్రాలు చేయించడం బలవంత పెట్టడం, డబ్బులకు ప్రలోభాలు పెట్టడం నేరమన్నారు.
లా అండ్ ఆర్డర్(Law and Order)ను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలను జరుపుకునేందుకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ నాయకులు, సర్పంచ్ వార్డ్ మెంబర్ ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

