cricket legend | నెటిజన్లను ఫిదా చేసిన క్రికెట్ లెజెండ్!

cricket legend | నెటిజన్లను ఫిదా చేసిన క్రికెట్ లెజెండ్!
cricket legend | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : క్రికెట్ మైదానంలో తన బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డులను సృష్టించిన క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. ఇప్పుడు కిచెన్‌లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. కేవలం బ్యాట్ పడితేనే కాదు, గరిటె తిప్పినా తనదైన శైలిలో అదరగొట్టగలనని ఆయన నిరూపించారు. తాజాగా సచిన్ టెండూల్కర్ స్వయంగా వంట చేస్తూ అభిమానులను అలరించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారింది.
సాంప్రదాయ శైలిలో ‘మోదక్’ తయారీ
సాధారణంగా పండగ రోజుల్లో మహారాష్ట్రలో ఎంతో ఇష్టంగా చేసుకునే సాంప్రదాయ మరాఠీ వంటకం ‘ఉక్డిచే మోదక్’ (ఆవిరి కుడుములు)ను సచిన్ ఈసారి స్వయంగా తయారు చేశారు. వంటగదిలోకి దూరి, ఎంతో నైపుణ్యంతో ఈ మోదకాలను తయారు చేస్తున్న దృశ్యాలను ఆయన వీడియో తీసి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.
సచిన్ పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. “క్రికెట్ మైదానంలోనే కాదు, కిచెన్‌లోనూ మీరే మాస్టర్ బ్లాస్టర్ సార్!” అంటూ ఒకరు కామెంట్ చేయగా.. “బ్యాటింగ్‌లోనే కాదు వంట చేయడంలోనూ మీకు తిరుగులేదు” అంటూ మరికొందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతూ, లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది.
CLICK HERE TO READ Cricket | స్మార్ట్ సన్‌గ్లాసెస్ వినియోగించొద్దని బీసీసీఐ ఆదేశం
