Malkajgiri Firing Husband Shoots Wife| మాట్లాడుకుందామని పిలిచి.. భార్యపై కాల్పులు
Malkajgiri Firing Husband Shoots Wife| మాట్లాడుకుందామని పిలిచి.. భార్యపై కాల్పులు
Malkajgiri Firing Husband Shoots Wife| మల్కాజ్‌గిరిలో కాల్పుల కలకలం
భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త
Malkajgiri Firing Husband Shoots Wife| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మల్కాజ్‌గిరిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో భర్త అరుణ్ తన భార్య ఉషారాణిని తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా అరుణ్, ఉషారాణి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెల్లవారుజామున మాట్లాడుకుందామని చెప్పి, మరో వ్యక్తితో కలిసి అరుణ్ ఉషారాణిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఉషారాణి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? అరుణ్‌తో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
