Hydra | హైడ్రాలో గ‌న్‌మెన్ ఆత్మ‌హ‌త్యా య‌త్నం…

Hydra | హైడ్రాలో గ‌న్‌మెన్ ఆత్మ‌హ‌త్యా య‌త్నం…

Hydra | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : ఆర్థిక ఇబ్బందులతో హైడ్రా(Hydra)లో పని చేస్తున్న గన్ మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. హైడ్రా కమిషనర్ వద్ద గన్ మ్యాన్ గా విధులు నిర్వహిస్తున్న చైతన్య హయత్ నగర్లో తన ఇంట్లో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. భార్యతో పాటు హయత్ న‌గ‌ర్‌లో నివాసం ఉంటున్నాడు. వెంటనే కామినేని ఆస్పత్రి(Kamineni Hospital)కి తరలించారు. కామినేనిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కామినేని ఆసుపత్రికి వెళ్లి హైడ్రా క‌మిష‌న‌ర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని క‌మిష‌న‌ర్‌ వైద్యులకు సూచించారు. వైద్యానికి హైడ్రా చేయూత అందిస్తుందని కుటుంబ సభ్యులతో మాట్లాడి క‌మిష‌న‌ర్ ధైర్యం చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కృష్ణ చైతన్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు చైతన్య యత్నించినట్టు, రెండేళ్ల క్రితం బెట్టింగ్, గేమింగ్ యాప్స్(Betting, Gaming Apps) లలో పెట్టుబడులు పెట్టి నష్టపోయినట్టు తెలుస్తోంది. తీసుకున్న లోన్లకు చాలావరకు జీతం కట్ అయి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదివరకే ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లోంచి వెళ్లిపోవడంతో హయాత్ న‌గ‌ర్ పోలీస్ స్టేషన్లో చైత‌న్య తండ్రి ఫిర్యాదు చేశారు.

ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో గతంలో తలలో రక్తం గడ్డకట్టడంతో వైద్య చికిత్స(Medical Treatment) తీసుకుంటున్న చైతన్య కుటుంబ స‌భ్యులు తెలిపారు. విధుల పరంగా అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎలాంటి ఇబ్బంది లేనట్టు, అధికారులతో పాటు ఇతర సిబ్బందితో మర్యాదగా, గౌరవంగా ఉంటూ విధులు నిర్వహిస్తుట్లు అధికారులు ధృవీకరించారు.

Leave a Reply