Rs.66 lakh | ఇన్సూరెన్స్ చేయించి మరీ….

Rs.66 lakh | ఇన్సూరెన్స్ చేయించి మరీ….

Rs.66 lakh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మానవ సంబంధాలు రోజు రోజుకి మంటకలిసిపోతున్నాయి. భార్యకు భర్తలేదు.. భర్తకు భార్య లేదు.. అలాగే పిల్లలను… తల్లిదండ్రులు చంపడం, తల్లిదండ్రులను పిల్లలు చంపడం లాంటి ఘటనలు ఇటీవల కాలంలో అనేకంగా చూస్తున్నాం… అయితే తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఖమ్మంలో జరిగింది.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తాళికట్టిన భర్తను భార్య అత్యంత దారుణంగా చంపేసింది. ఇందుకు సమీప బంధువు సాయం సైతం తీసుకుంది. అనంతరం కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా… భర్తను తానే హత్య చేసినట్లు అంగీకరించింది.

Rs.66 lakh

భర్త పేరుమీద ఉన్న రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భార్య ఎవరూ చేయని దుర్మార్గానికి ఒడిగట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. భర్తను అత్యంత దారుణంగా హత్య చేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం నగరానికి చెందిన చాగంటి రవి(52), ప్రశాంతి దంపతులు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ చాగంటి రవి కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే ఆయన మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్త ఎలాగూ చనిపోతాడనే ఆలోచనతో భార్య ప్రశాంతి ఓ పథకం వేసింది. గత ఏడాది జూలైలో తన బంధువు శ్రీనివాస్ సహాయంతో రవి పేరు మీద రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది ప్రశాంతి. ఆ డబ్బుల కోసం ఆమె అనుకున్నంత పనిచేసింది. ఈ విషాద ఘటనపై ఆ ప్రాంతమంతా చర్చించుకుంటున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆమె నిజాలను ఒప్పుకోక తప్పలేదు.

Leave a Reply