రైతు సంక్షేమమే ప్రధాన ద్యేయం..!

మాక్లూర్, ఆంధ్రప్రభ : రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం చైర్మన్ బురోల్ల అశోక్ అన్నారు. ఈ నెల 4 వ తేదిన రాష్ట్ర హైకోర్టు గత పాలకవర్గాలకే విండో బాధ్యతలు అప్పగించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దింతో పిఐసి ఫిరోజ్ ఖాన్ నుండి విండో చైర్మన్ బాధ్యతలను బురోల్ల అశోక్, పాలకవర్గ సభ్యులు బుధవారం స్వీకరించారు.

అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో రైతుల అభ్యున్నతికి చెప్పటాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారిస్తామన్నారు. విండో ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఇందులో వైస్ చైర్మన్ శేఖర్, డైరెక్టర్ కాశినాథ్, మాక్లూర్ గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర రావు, సెక్రటరీ రతన్, ప్రవీణ్, సెంటర్ ఇంచార్జ్ విజయ్, రైతులు కనకయ్య, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply