రాజు సార్ పదవీ విరమణ విద్యారంగానికి లోటు..

  • మున్సిపల్ చైర్ పర్సన్ సునీత, వైస్ చైర్పర్సన్ రామ

కేసముద్రం, ఆంధ్రప్రభ : స్టేషన్ హైస్కూల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు పదవీ విరమణ సందర్భంగా సోమవారం స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సత్యమూర్తి ముఖ్య అతిథిగా హాజరై, ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి వాటి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

మున్సిపల్ చైర్‌పర్సన్ భానోత్ సునీత వెంకన్న మాట్లాడుతూ, రాజు పాఠశాలలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసి, విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు.

వైస్ చైర్‌పర్సన్ అల్లం రామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, క్రమశిక్షణ, నిబద్ధత, పట్టుదలతో రాజు పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పరీక్షల విభాగం అధికారి మందుల శ్రీరాములు, ఎంఈవో యాదగిరి, జిల్లా సైన్స్ అధికారి బి. అప్పారావు, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.