35MLAs | విజయ్‌కు మద్దతు దిశగా ఎమ్మెల్యేలు
35MLAs | విజయ్‌కు మద్దతు దిశగా ఎమ్మెల్యేలు
35MLAs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతుండగా, కొందరు ఎమ్మెల్యేలు టీవీకే అధినేత విజయ్ కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.
చెన్నైలోని సీనియర్ నేత సీవీ షణ్ముగం కార్యాలయంలో అన్నాడీఎంకేకు చెందిన సుమారు 35మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విజయ్‌కు మద్దతు ఇవ్వాలనే దిశగా చర్చలు జరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించేందుకు ముందుకు రావడం, ఇప్పుడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఈ నిర్ణయం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
