Tragedy | రేకుల షెడ్డు కూలి.. నలుగురు రైతులు…

Tragedy | రేకుల షెడ్డు కూలి.. నలుగురు రైతులు…

Tragedy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలుల తీవ్రతకు రేకుల షెడ్డు కూలిపోవడంతో నలుగురు రైతులు మృతిచెందారు.

ధాన్యం పంటను కాపాడుకునే క్రమంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా షెడ్డు కుప్పకూలి వెంకటేశ్‌, అభిరామ్‌, లచ్చన్న, నాగరాజు అనే రైతులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను లక్షెట్టిపేట, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. భారీ ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా విరిగి పడినట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply