Lokesh | అనుమానాలుంటే చర్చకు రండి..

Lokesh | అనుమానాలుంటే చర్చకు రండి..

‘జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరు’

Lokesh | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: డీఎస్సీ నియామకాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు బహిరంగ చర్చకు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం కంటే వాస్తవాలతో మాట్లాడాలని ఆయన సూచించారు.

తాము బురద చల్లి పారిపోయే రాజకీయాలు చేసే వారు కాదని, అవసరమైతే సమాధానం చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని లోకేశ్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి సమీపంలోనే ఉండి కూడా ప్రజలకు, ప్రతిపక్షాలకు సమాధానాలు ఇస్తున్నామని అన్నారు.

కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా నిజమైన ఉద్యోగ క్యాలెండర్‌ను అమలు చేస్తోందని ఆయన తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారదర్శకంగా నియామక ప్రక్రియలు చేపడుతున్నామని చెప్పారు. డీఎస్సీ నియామకాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన లోకేశ్, “జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలను అడ్డుకోలేరు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.