ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్
ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్
కమ్మర్‌పల్లి, (ఆంధ్రప్రభ): కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పసుపుల సాయన్న, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
