కేజీబీవీ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

కేజీబీవీ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ సమీపంలో ఉన్న కేజీబీవీ పాఠశాలను ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగదిని, తరగతి గదులను,పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించి, విద్యార్థుల బాగోగులు తెలుసుకున్నారు.
స్థానిక స్పెషల్ ఆఫీసర్ మామిడి శ్రీవాణి పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, స్థానిక ఇన్చార్జి తాహసిల్దార్ నేరెళ్ల రామ్మోహన్, ఎమ్మారై గంగరాజు ఉన్నారు.
