మద్యానికి బానిసై..
మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్కటూర్ గ్రామానికి చెందిన ఏలేటి నర్సారెడ్డి (35) అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, నర్సారెడ్డి ఈనేల 9న రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతను అతిగా మద్యం సేవించేవాడని, మద్యానికి బానిసై ఫిట్స్‌తో బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

అతిగా మద్యం సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు, మతిస్థిమితం లేమితో ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.ఈ మేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందిన నర్సారెడ్డి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
