“ఆంధ్రప్రభ ఎఫెక్ట్”

  • విద్యుత్ సమస్యలు పరిష్కరించిన అధికారులు

సదాశివనగర్, ఆంధ్రప్రభ : విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రభలో వచ్చిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ సమస్యలను శనివారం పరిష్కరించారు. మండలంలోని మోడెగాం గ్రామంలో చెరువు కట్టపై విద్యుత్ స్తంభం పూర్తిగా వంగి ప్రమాదకరంగా మారిందని, జనగాం గ్రామంలో విద్యుత్ స్తంభం కింద పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆంధ్ర ప్రభ వెబ్ తో పాటు పత్రికలో వచ్చినా కథనానికి విద్యుత్ శాఖ ఏఈ గంగాధర్ స్పందించి వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టారు. మోడేగం సర్పంచ్ గౌడెల్లి గంగాధర్, జనగాం సర్పంచ్ దార్వాయి మధు బాయి శ్రీకాంత్, గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.