సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే..
- ఈనెల 20 నుంచి నిరవధిక నిరహారదీక్ష..
- అధికార పార్టీకి తొత్తులుగా మారిన కమ్యూనిస్టు సంఘాలు..
- సత్తుపల్లి ఏరియా జిఎంను లేబర్ కోర్టుకు ఈడుస్తా…
- గాంధేయ మార్గంలోనే మెడలు వంచుతాం..
- సత్తుపల్లి బావి బాటలో కల్వకుంట్ల కవిత
సత్తుపల్లి, ఆంధ్రప్రభ : మాజీ ఎమ్మెల్సీ, జాగృతి సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్వహిస్తున్న బావి బాట స శనివారం సత్తుపల్లి చేరుకున్నది.. సందర్భంగా సింగరేణి కార్మిక సంస్థహెచ్ఎంఎస్ కార్యకర్తలతో కలిసి మొదట స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఘటించిన ఆమె అనంతరం సత్తుపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంకు చేరుకున్నారు.. ఈ సందర్భంగా ఆమెను లోపలికి రానివ్వకుండా గేట్లు వేసి పోలీసులు అడ్డుకోవడంతో మరీ గేట్లు తోసుకొని లోపటికి చేరుకున్నారు.. ఈ సందర్భంగా కాస్త ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది..
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుర్తింపు సంఘాలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ అధికార పార్టీ కాంగ్రెస్ కు తొత్తులుగా మారాయని ఆరోపించారు.. కార్మికులను కార్మిక సంఘాలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.. కార్మికులతో కలిసి వస్తున్న తనను రానివ్వకుండా గేట్లు వేసిన సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ను లేబర్ కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.. ఈనెల 20లోగా సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే హెచ్ఎంఎస్ తరపున తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. కార్మిక సమస్యల పరిష్కారంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు..
ఈ రెండు యూనియన్ల నాయకులు సింగరేణి బావుల్లో దూకిచావమని శాపనార్థాలు పెట్టారు.. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ పథకం అమల్లోకి తేవాలని, రిటైర్డ్ ఉద్యోగుల అలవెన్స్ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.. డిపెండెంట్ ఎంప్లాయిస్ పథకం అమలు కోసం ప్రతి నెల సింగరేణి మెడికల్ బోర్డు సమావేశం కావాలని, అవసరమైతే నెలకు రెండుసార్లు కూడా సమావేశం కావాలని సూచించారు.. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది సింగరేణి ఏర్పడిన నాటి నుంచి కార్మికుల వారసులకు లభిస్తున్న హక్కు అన్నారు.. దాన్ని కాదని కార్మికుల వారసులకు అన్యాయం చేస్తే సహించేది ఉండదని హెచ్చరించారు..
అనేక పోరాటాలతో ఫలితంగా కార్మికులకు అండగా నిలిచేందుకు ఎరుపు రంగు సాధించుకోవడం జరిగిందని గుర్తు చేశారు.. ఆ రంగును ఆసరా చేసుకుని సంఘాలుగా ఏర్పడిన ఏఐటీయూసీ,సిఐటియు తదితర కార్మిక సంఘాలు కార్మిక హక్కుల సాధనలో అధికార పార్టీతో ఉన్న సంబంధాలతో ముందడుగు వేయలేకపోతున్నాయని ఆరోపించారు.. గాంధేయ మార్గంలోనే సింగరేణి యాజమాన్యం మెడలో ఉంచుతామని తెలిపారు.. సింగరేణి కార్మికుల పొట్ట కొట్టే ప్రయత్నం జరిపితే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు..
గేట్లు వేసినంత మాత్రాన, పోలీసులు అడ్డుకున్నంత మాత్రానా ఉద్యమం ఆగదని, కార్మికులను చైతన్య పరిచేందుకు మరీ కంకణం కట్టుకుని వచ్చామన్నారు.. తానొస్తున్నానని తెలుసుకున్న యాజమాన్యం , ముందే కార్మికులకు మాస్టర్లు వేసి పంపడం కార్మిక శాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధమన్నారు.. కార్మిక హక్కులు ఎలా కాపాడలో తనకు బాగా తెలుస్తునన్నారు.
సమస్య చెప్పుకునేందుకు వస్తుంటే రానివ్వకుండా అడ్డుకోవడం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు.. ఈ సందర్భంగా వాల్టేర్ కవి చెప్పిన “”నీవు చెప్పేది నాకు నచ్చినా.. నచ్చకపోయినా నా రక్తం దార పోసి నీ హక్కును కాపాడుతాననే”” సూక్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఈ పోరాటం ఇంతటితో ఆగదని, ఈనెల 20లోగా స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఉధృతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.. కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు..
