ఆలయ నిర్మాణానికి రూ.5.71 లక్షల విరాళం
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు రూ.5.71 లక్షల విరాళం అందజేశారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న ఒరగంటి మధు, నాందేడ్ ప్రవీణ్ కలిసి ఆలయ నిర్మాణం కోసం రూ.5,71,000 విరాళాన్ని పంపించారు. ఈ విరాళాన్ని గ్రామ మాజీ ఉపసర్పంచ్ ఓ. భూమేశ్వర్, వీడీసీ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కమిటీ ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ ఓ. భూమేశ్వర్ మాట్లాడుతూ, ఆలయ నిర్మాణానికి ప్రవాస గ్రామస్థులు ఉదారంగా సహకరించడం అభినందనీయమన్నారు. వారి దాతృత్వాన్ని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నారని తెలిపారు. గ్రామ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ సహకారం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, గ్రామస్తుల సహకారంతో త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వీడీసీ అధ్యక్షుడు నరేష్, రమేష్, ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
