ఉత్తరవాహిని గోదావరి ఉప్పొంగి ప్రవాహం
చెన్నూర్, ఆంధ్రప్రభ: గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో చెన్నూరు పంచక్రోశ ఉత్తరవాహిని గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. రెండు రోజులుగా గోదావరి నిండు కుండలా ప్రవహిస్తుండటంతో నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. వరద పరిస్థితుల దృష్ట్యా గోదావరి తీరం వద్దకు ప్రజలు, మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు ఆంక్షలు విధించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
