కల్వర్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు…
కల్వర్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు…
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని రథం చెరువు నుండి ప్రవహిస్తున్న డి50 కెనాల్ పై కల్వర్టు నిర్మాణానికి 18 లక్షల ఎం.జి. ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులు కటాయించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు చేపూరి కిషోర్ తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఇరుకు కల్వర్టు గుండా కెనాల్ కు అవతలి వైపుకు ఉన్న శ్మశానవాటిక కు వెళ్ళేందుకు పాడే మోయడానికి సైతం ఇబ్బంది గా ఉండేది. కాగా కల్వర్టు పూర్తవుతే ఆ కష్టాలు తీరనున్నాయి.
