రేపల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం
రేపల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్గల్ మండలం కారేపల్లి గ్రామంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోవింద్ మాట్లాడుతూ .. ప్రతి నెల మొదటి మంగళవారం అన్నదానం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సుమారు 1000 మంది కారేపల్లి గ్రామం తో పాటు చుట్టుపక్కన ప్రజలు హాజరు అవుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తాండ పెద్ద మనుషులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
