బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది మల్కాపురం చైతన్య కిరణ్

వికారాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసిన ఫార్ములా–ఈ కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని, ఈ కేసును న్యాయస్థానంలో చట్టపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది మల్కాపురం చైతన్య కిరణ్ అన్నారు. ఫార్ములా–ఈ కేసు విచారణకు సంబంధించి శుక్రవారం నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా చైతన్య కిరణ్ మాట్లాడుతూ, రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కేసులో వాస్తవాలు తప్పకుండా వెలుగులోకి వస్తాయని అన్నారు. చట్టబద్ధంగానే కేసును ఎదుర్కొని న్యాయం సాధిస్తామని స్పష్టం చేశారు.