జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

బిచ్కుంద, ఆంధ్రప్రభ : ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(MLA Thota Lakshmi Kantarao) అన్నారు. ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన కేంద్రాలలోని సోయా(Soya) అమ్మాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రతాపరెడ్డి(Kavita Prathapara Reddy), సొసైటీ చైర్మన్ శ్రీహరి బాలు, ఉపాధ్యక్షులు యాదవరావు, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మంచి యోగేష్ గుప్తా, పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, మండల అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్, టౌన్ అధ్యక్షుడు షాహేల్, మైనార్టీ నాయకుడు అసద్ అలీ తదితరులు పాల్గొన్నారు.