సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ పట్టణం అభివృద్ధి కొరకు కట్టుబడి ఉన్నామని, సమస్యల పరిష్కారం కొరకు పూర్తి సహకారం అందజేస్తామని పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి లు స్పష్టత ఇచ్చినట్టు ఒకటో వార్డు కౌన్సిలర్ ఆరెపల్లి శ్రీజ ( నాగేంద్రబాబు ) తెలిపారు.

మంగళవారం వారిని టీజీఎండీ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గున్నాల వెంకటేష్ గౌడ్ లతో కలిసి నాయకులను కలిశారు. ఒకటో వార్డు కౌన్సిలర్గా విజయం సాధించిన తరువాత నాయకులను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంకల్పం పట్ల ప్రజలు చూపిన ప్రేమకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సాధించిన విజయం అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పూర్తి గా అండగా ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పీసీసీ తో పాటు ప్రభుత్వ సలహాదారులను ఒకటో వార్డు కౌన్సిలర్ శాలువా, పూలమాల తో సత్కరించారు.

Leave a Reply