Ktr | మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారు..
Ktr | మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారు..
కాంగ్రెస్ అరాచకాలు చేస్తోంది…
మాజీ మంత్రి కేటీఆర్
Ktr | ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం కిడ్నాప్ చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హంగ్ వచ్చిన చోట కాంగ్రెస్ అరాచకాలు చేస్తోంది. మా కౌన్సిలర్లను పార్టీ మారాలంటూ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. సింగరేణిలో కాంగ్రెస్ ,బీజేపీ కలిసి పినిచేస్తున్నాయని, కాంగ్రెస్, సీపీఐ కుటమిగా ఉన్న సింగరేణిలో జరుగుతున్ దోపిడిని అరికట్టడానికి బీఆర్ఎస్ సీపీఐకు మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ స్పషం చేశారు.
సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. లంబాడా తండాలను గ్రామ పంచాయితీలుగా చేసింది కేసీఆర్ అని చెప్పారు. 3146 కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పుడు 3146 మంది గిరిజన బిడ్డలు సర్పంచ్‌లు అయ్యారని తెలిపారు. గిరిజన తండాల్లో ఇంటింటికీ నీటి వసతి కల్పించామని పేర్కొన్నారు. నాలుగున్నర లక్షల ఎకరాలకు కేసీఆర్ ఒకే రోజు పోడు పట్టాలిచ్చారని అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
