Krithi Shetty | ఈసారైనా ఫామ్ లోకి వచ్చేనా..?
Krithi Shetty | ఈసారైనా ఫామ్ లోకి వచ్చేనా..?
Krithi Shetty | ఫ్లాప్స్‌తో వెనకబడిన కృతి కెరీర్
ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న బ్యూటీ
క్రేజీ మల్టీస్టారర్‌లో అవకాశం
ఈ సినిమాతో కంబ్యాక్ సాధిస్తుందా?
Krithi Shetty | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కృతి శెట్టి.. ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించి.. అందరి దృష్టిని ఆకర్షించింది. వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఎప్పుడైతే వరుసగా ఫ్లాపులు వచ్చాయో అప్పటి నుంచి కెరీర్ లో బాగా వెనకబడింది. సరైన ఆఫర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. బాలీవుడ్ వెళ్ళాలని ట్రై చేసింది కానీ.. వర్కవుట్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ లక్కీ ఛాన్స్ దక్కించుకుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇంతకీ.. కృతి శెట్టికి వచ్చిన ఆ లక్కీ ఛాన్స్ ఏంటి..?
Krithi Shetty | ఆఫర్స్ కోసం కృతి వెయిటింగ్..

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి శెట్టి. బేబమ్మ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి ప్రయత్నంలోనే అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో.. ఈ కన్నడ భామకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలతో వరుసగా విజయాలు సాధించడంతో ఈ అమ్మడుకి మరింత డిమాండ్ పెరిగింది. అయితే.. ఆతర్వాత కృతి నటించిన మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, కస్టడీ, మనమే తదితర చిత్రాలలు ప్లాప్ అవ్వడంతో కెరీర్ లో బాగా వెనకబడింది. ఒకప్పుడు బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.
Krithi Shetty | కళ్యాణ్ రామ్ కు జంటగా కృతి..

ఇలాంటి టైమ్ లో కృతికి క్రేజీ మల్టీస్టారర్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. వెంకీ, కళ్యాణ్ రామ్ ల క్రేజీ కాంబోలో భారీ మల్టీస్టారర్ మూవీ త్వరలో సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాని హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే.. ఇందులో వెంకీకి జంటగా కీర్తి సురేష్ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కు జంటగా కృతి శెట్టిని తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. జూన్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇది నిజంగా కృతికి లక్కీ ఛాన్సే. మరి.. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.
