శుక్ర‌వారం విజయోత్సవ సభ..

శుక్ర‌వారం విజయోత్సవ సభ..

కోటమి రెండు సంవత్సరాల పాలన పూర్తి అయిన సందర్భంగా..
ముఖ్యఅతిథిగా జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ..
కూటమి నాయకులు కార్యకర్తలు తరలిరండి అంటూ ఎమ్మెల్యే కొలికిపూడి ఆహ్వానం.

తిరువూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరువూరు నియోజకవర్గంలో శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయం తెలిపింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లక్ష్మీపురం గ్రామంలోని మను గార్డెన్స్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు ప్రసంగించనున్నారు. కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు, మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి చేసింది.